Friday, January 9, 2009
ఫ్రియతమా
ఊహలే వినీలాకాసమైతె అలొచనలే అనంతమవుతాయి
మనసే తుషార బిందువైతె చిగురుటాకులు ఊసులవుతాయి
ప్రేమే ప్రవాహమైతే ఎడబాటు సుడిగుండమవదా !!!
Friday, January 2, 2009
Thursday, October 30, 2008
జీవి -3
Thursday, October 16, 2008
తను...
తొలకరి లొ కురిసిన వాన
ఆ మట్టిలోంచి వచ్చే వాసన
లయబద్దంగా వూగే పచ్చని పైరు
ఎవరి ఉహాలు తెలియచేస్తున్నయి
వయ్యారంగా సాగుతూవున్న పిల్లకాలువ
ఈదుతు కేరింతలు కొడుతున్న ఆ చేప పిల్ల
స్వచ్చంగా అందంగా నవ్వుతున్న తామర పువ్వు
ఎందుకు తనని అంతగా గుర్తు చెయ్యాలనుకొంటున్నయి
లేత మావి చిగురు తింటూ కూస్తున్న ఆ కొయల
జేగంట చిరు సవ్వడితొ చెంగున దూకుతున్న లేగదూడ
పెరటిలొని ఎర్రమందారంతొ దోబూచులాడుతున్న తుమ్మెద
ఎలా కలుపగలవు తనతొ కడకంటూ సాగలేనీ నా అనుబంధాన్ని
బాల భానుడు విసిరే ఆ లేత కిరణాలు వాడిగా గుచ్చుకుంటుటే
తొలికోడి కూస్తున్న ఆ పిలుపుతో అర్ధాంతంగా ఆపుతూ తన తలపులు
హేమంత రుతువు లొ రాలిన ఆకులాగ నా బుగ్గ మీదకి జారుతున్న నీటి చుక్క
ఎప్పటకీ ఇదే నిజం అని ఎందుకు నా మనసుకు నచ్చ చెప్పలేకపొతున్నాయి
Thursday, September 18, 2008
ఒంటరి
మదిని ముసురుకొన్న చీకట్లను పారదోలలేకున్నా
అదిమి పెట్టలేక అశక్తుడవుతున్నా
Tuesday, September 16, 2008
జీవి -2
ఒక్కసారి నిన్న జరిగిన ఆఫీసు లో జరిగిన సంబాషణ గుర్తుకు తెచ్చుకో అంది ఆత్మని,
నిన్న లంచ్ అవర్లో కొలీగ్స్ ప్రేమ అనే విషయం మీద డిస్కషన్ లేవదీసారు. అసలు ప్రేమ అంటే ఏంటి?ఎన్ని రకాలు, అదేదో త్రీ రొసేస్ టీ యాడ్ లాగా రంగు,రుచి,చిక్కదనం మొదలైనవి ఏమైనా వుంటాయా అని కామెడీగా కొందరు,వీటిల్లో వర్గాలు,ప్రత్యేక,సమైక్య లాంటివి ఏమయినా విడగోట్టచ్చ అంటూ కొందరు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. తల్లి పిల్లల మీద చూపించేదే నిజమైన ప్రేమ అన్నాడో కుర్ర వుద్యోగి.అది ప్రేమ కాదు,అది అతి సహజం,పకృతి దర్మం అంటూ తేలిగ్గా తీసిపారేస్తూ ,నిజమైన ప్రేమ స్నేహం లోనే వుంది అంటూ తనకి ఆఫీసు లొన్, సాంకషన్కానప్పుడు ఒక లక్ష రూపాయలు,రూపాయి వడ్డికి ఇచ్చిన ఫ్రెండ్ ని గుర్తు చేసుకొంటూ చెప్పాడు ఎకౌంటు ఆఫీసర్ నాగబుషణం.కానే కాదు జంతువుల మీద చూపించేదే నిజమైన ప్రేమ అంటూ తన అభిమాన హీరో బార్య స్థాపించిన జంతు సంరక్షణ సంస్టని గుర్తు చేసుకొంటూ చెప్పాడు శివ అనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. లేదు లేదు ఆక్సిడెంట్ లో గాయపడిన వారికీ రక్త దానం చేయటం లోనే వుంది నిజమైన ప్రేమ అంటూ తన హీరో స్థాపించిన బ్లడ్ బ్యాంకు ను గుర్తు చేసుకొంటూ రిటార్ట్ ఇచ్చాడు స్టోర్ ఇంచార్జ్ టాగూర్. ఇలా సంధర్బం కాకపోయునా అసందర్బంగా,అడ్డుగోలగా,తమ అబిప్రాయాల్ని వేరే వాటిని ఆడ్ చేసి ,లింకులు పెట్టి ప్రేమ గురించి మాట్లాడసాగారు. వీటన్నిటిని తోసిరాజని "మానవ సంబందాలు అన్ని ఆర్ధిక సంబందాలే " కాబట్టి నిజమైన ప్రేమకు నిర్వచనం ఇవ్వటం కష్టం ,ఎందుకంటే మనం చూపించే ప్రేమ, ప్రదేశం,సమయం,సంధర్బం,అవసరం,బాధ్యత,మన మానసిక స్థితి,ఇలా కొన్నిఅంశాల్ని బట్టి మారుతూ వుంటుంది కాబట్టి ఒక నిర్వచనం అంటూ వుండదు అంది పి.ఆర్.ఓ సహజ.
ఆకలితో లంచ్ బాక్స్ మీద దాడి చేస్తున్న జీవికి ఈ మాటలు వినపడగానే చురుక్కున తల ఎత్తి సహజ వేపు చూస్తూ, అంటే ఈ స్టేట్మెంట్ నీదా అని అడిగాడు.నాది కాదు, ఇది ఎప్పుడో అరిస్టాటిల్ చెప్పాడు.దానినే నేను కొంచెం విడమర్చి చెప్పాను .అంతే కాదు దీనిని నేను బలంగా నమ్ముతున్న అంది. సహజ నువ్వు చెప్పింది చాలా అసహజం గా వుంది, ఎందుకంటే ప్రేమే అనేదే లేకపోతె ఈ ప్రపంచం ఇలా వుండదు అన్నాడు కొంచెం వ్యంగ్యంగా. కరక్టే, ఐతే ప్రేమ అనేది లేదు అని నేను చెప్పటం లేదు అది ఆర్ధికంగా మానవ జీవితం తో ముడిపడింది అని చెబుతున్నా అంతే. అది నువ్వు నిరుపించగలవా అంటూ కొంచెం చులకనగా కామెంట్ చేసాడు పెద్ద బొజ్జ వున్న హెడ్ గుమాస్తా గుర్నాధం. అవును అవును నిరూపించ గలవా అంటూ మిగతావారు వంతపాడారు.సరే ఐతే మీరు ఆఫీసు వదిలిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా ఈ లోపు మీకు ఎదురైన సంఘటనలు బేరిజు వేసుకోండి,మీకు మీరే జడ్జీలు.అప్పుడు మీరే ఒప్పుకొంటారు అంది నవ్వుతు సహజ. చాలు చాల్లేవమ్మా అంత టైం ఎవరికుంది ఇక్కడ,ఐనా ఈ రోడ్ల మీద క్షేమంగా ఇల్లు చేరినప్పుడు కదా అంటూ జోక్స్ వేసుకొంటూ ఎవరి సీట్స్ లోకి వారు వెళ్లారు. వెళ్ళిన పది నిముషాలకే ఈ టాపిక్ అందరు మర్చిపోయారు ఒక్క జీవి తప్ప.
ఐతే ఇందులో నేను చేసిన తప్పు ఏంటి అంది అర్ధం కాక ఆత్మ . మిగతాది కూడా గుర్తు తెచ్చుకో బాబు అంది అంతరాత్మ .
ఆ రోజు సాయంత్రం ఆఫీసు ను వదిలి ఇంటికి బయలుదేరిన తర్వాత జీవి......
Thursday, August 14, 2008
జీవి -1
నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదు,నా మాటకు విలువ ఇవ్వటం లేదు,నీకు అసలు మానవత్వం లేదు అంది అంతరాత్మ కోపంగా,ఎ విషయం లో అంది మండిపడుతూ ఆత్మా. చాల విషయాల్లో బదులిచ్చింది అంతరాత్మ.వివరంగా చెప్పు అంది ఆత్మ. ఐతే విను
(ఇంకా వుంది)