Thursday, May 22, 2008

సభ కి నమస్కారం

అమ్మా,అయ్యా, సోదర సోదరిమనుల్లర,మిత్రులారా అందరకి నా వందనాలు,
నేనూ మీ అందరి బ్లాగ్లులు చదివి నాకు కూడా ఒక బ్లాగ్ మొదలు పెట్టలనిపించింది. ఇలా మొదలు పెట్టాను.కానీ ఏమి రాయాలో,ఎలా రాయాలో ఏమి తెలియటం లేదు.నిజం చెప్పాలంటే ఇప్పుడు వున్న బ్లాగులు చాలు. అవి చదవటానికే సమయం సరిపోవటం లేదు.ఐతే కొన్ని బ్లాగులు చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మీదఆయా బ్లాగ్ కర్తలు వెలిబుచ్చిన వివరణలు చూసి నేనూ ఐతే ఇలా రాసేవాడిని,లేకపోతె ఇంకాఎక్కువ రాయొచ్చు కదా అనుకొంటూ చాల ఆలోచించేవాడిని.సరే నేనూ స్పందించిన ప్రతీ విషయం మీద నా అంతరాత్మ ప్రబోధం మేరకు, సభ్యత సంస్కారం గాడి తప్పకుండ మన బ్లాగారన్దరి మనోవాంచ (పక్కగా తెలుగులోనే రాయాలి అనే నిబంధనని) పాటిస్తానని ,రంగనాయకమ్మ గారి లాగా వాడుక బాష లోనే రాయగలను అని నొక్కి నొక్కి వక్కానిస్తున్న.
మీ అమూల్యమైన సలహాలు సూచనలు తప్పకుండ పాటిస్తానని నేనూ మీకు తెలియచేసుకుంటున్న.అయ్యా తప్పకుండా త్వరలో మీ ముందుకు వస్తానని(ఇదు ఏళ్ళు కాదు లెండి)ఇందిరస్వామ్యబద్దంగా నేనూ మీతోనే అని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
మీ
ఆదిత్య కోడూరి.

2 comments:

Vaishu said...

Hi
Welcome to the bloggers world.

All the best.

Be creative

--Vaishu.

రాధిక said...

ఇప్పుడే చూసాను ..మే లోనే మొదలుపెట్టారా?మీ బ్లాగు కూడలిలో లిస్ట్ చేసారా?లిస్ట్ చేసి వుంటే మరి మీ మొదటి టపా ఎలా మిస్ అయ్యాను?
word veiication తేసేయండి.